తానా చేయుత తో సమాజాభివృద్ధికి కృషి

Published: Thursday December 08, 2022
మధిర. రూరల్ డిసెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో మాటూరు పేట గ్రామంలో బుధవారం నాడు తాన చేయూతతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా అవసరాలను గుర్తించి వారికి సౌకర్యాలు కల్పిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, తాళ్లూరి జయ శేఖర్ శృంగవరపు నిరంజన్, సామినేని రవి, నాయన పాటి విశ్వనాధ్, వేమూరి సతీష్ తెలిపారు. బుధవారం మధిర మండల పరిధిలోని మాటూరు పేట గ్రామంలో గ్రామ టిఆర్ఎస్ నాయకులు న్యాయవాది నెల్లూరు రవి అధ్యక్షతన తానా చైతన్య స్రవంతి సభ నిర్వహించారు
ఈ సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. తానా ఆధ్వర్యంలో స్థానిక పెద్దల ద్వారా ప్రజా అవసరాలను గుర్తించి వారికి సేవలందించడం జరుగుతుందని తెలిపారు మాతృదేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ఈ ట్రస్ట్ పనిచేస్తుందని వివరించారు తెలుగు రాష్ట్రాల్లో 500 సైకిళ్లు పంపిణీ చేయాలనే లక్ష్యంలో భాగంగా ఈరోజు మాటూరు పేట గ్రామంలో విద్యార్థులకు 36 సైకిల్ నాలుగు లాప్టాప్ లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రణాళికా బద్దంగా లక్ష్య సాధనకు కృషి చేయాలి అన్నారుసమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకున్న వారు విజయాలను సాధిస్తారని తెలిపారు లక్ష్యంపై గురి పెట్టి లక్ష్యాన్ని సాధించి గూగుల్ గుర్తించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు అదేవిధంగా లాప్టాప్ లు అందజేశారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు క్యాష్ అవార్డులు అందజేశారు. ముందుగా మాటూరు జిల్లా పరిషత్ హై స్కూల్కు టీవీ బహుకరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామినేని నాగేశ్వరరావు కిలారు ముద్దుకృష్ణ డాక్టర్ రామనాథం మల్లాది వాసు అన్న మోహన్ రావు ధని శెట్టి శ్రీనివాస రావు చిలువేరు బుచ్చి రామయ్య శాంతయ్య శివరామకృష్ణ మాదల నరసింహ రావు ఉపాధ్యాయులు కృష్ణమాచార్యులు ఇబ్రహీం బండి నాగేశ్వరరావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు