కబ్జా ప్రభుత్వ భూమిని కాపాడి పంచానామ చేసిన అర్ ఐ గంగరాజు

Published: Wednesday September 21, 2022
జన్నారం, సెప్టెంబర్ 20, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల్ గ్రామంలోని పొనకల్ శివారులో గల మెన్ రోడ్డు పక్కన గ్రామ మద్యన  ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుందని దానిని కాపాడి పంచానామ చేసిన మండల అర్ ఐ గంగరాజు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల తాహసిల్థార్ అదేశా మెరకు పోనకల్ శివారులో గల సర్వే నెంబర్ 5 లో ఉన్న ప్రభుత్వ భూమిలో అదే గ్రామానికి చెందిన సాంబారి అంజయ్య తన అనుచరులలో వచ్చి హద్దు రాళ్లు ఏర్పాటు చేసి కబ్జా చేసుకున్నాడు. గ్రామ కమిటీ ఆద్వర్యంలో మండల అధికారులు స్పందించి సర్వేనెంబర్ 5 లో గల ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. ఈ విషయం స్థానిక తహసీల్దార్ కిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో తహశీల్దార్ ఆదేశాల మేరకు ఆర్.ఐ గంగరాజు కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించి, ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన హద్దు రాళ్లును తొలగించడం జరిగిందని, అమె సూచించారు. ఈ కార్యాక్రమంలో సామాజిక కార్యకర్త శ్రీరాముల భూమాచారి, మర్రిపల్లి అంజయ్య, ఎండి రహీం, వీరాచారీ, మర్రిపల్లి శేఖర్, నర్సయ్య, సురేష్, సాయి, పవన్, రవి, శ్రీను, ఎల్లయ్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు.