మిర్చి రైతులను ఆదుకోవాలి

Published: Friday December 10, 2021
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల సిపిఎం మండల కమిటీ సమావేశం లెనిన్ అధ్యక్షతన ఏన్కూర్ లో సిపిఎం ఆఫీస్ నందు జరిగింది ఈ సమావేశానికి సిపియం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూక్య వీరభద్రం మాట్లాడుతూ ఏన్కూరు మండలం లోని మిర్చి తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నారని ప్రకృతి వైపరీత్యాల వలన ఈ పంటలు పూర్తిగా వైరస్ వల్ల దెబ్బతిన్నాయని ఆ రైతులను ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని ఆయన అన్నారు ఇప్పటికే రైతులు మిర్చి ఎకరానికి సుమారుగా లక్ష రూపాయలు ఖర్చు వచ్చిందని వైరస్ వాగటం వల్ల రైతులకు నష్టం జరిగిందని ఆయన అన్నారు. మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు ఈ సమావేశంలో లో లో సిపిఎం మండల కార్యదర్శి దొంతర బోయిన నాగేశ్వరరావు ఏర్పుల రాములు నండూరి శ్రీనివాసరావు స్వర్ణ కృష్ణారావు తమ్మినేని వెంకటయ్య సాయి రవి తదితరులు పాల్గొన్నారు.