కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ప్రమాదకరమైన 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల

Published: Tuesday November 23, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 22 ప్రజాపాలన ప్రతినిధి : నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రమాదకరమని ఈ చట్టాలు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయని వీటిని రద్దు చేయాలని ఢిల్లీని చుట్టుముట్టి లక్షలాది మందితో శాంతియుత నిరసన తెలియజేస్తున్న ప్పటికీ. బిజెపి ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించి రైతుల పైన విచక్షణ రహితంగా లాఠీచార్జిచేసిన నీటి ఫిరంగులతో భాష్ప వాయు గోలలతో దాడి చేసిన  రోడ్లపై కందకాలు తవ్వి మేకులు కొట్టి యుద్ధవాతావరణం సృష్టించిన భయంకరమైన కరోనా పరిస్థితులల్లో ప్రాణాలను లెక్కచేయకుండా  చివరికి 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన మొక్కవోని దర్యంతో పట్టువీడని విక్రమార్కుల్లా రైతాంగ పోరాటం చేసిన ఫలితంగా ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపీ కండ్లు తీర్పించాయ్. ఐదు రాష్ట్రాల్లో జగబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని నూతన వ్యవసాయ చట్టాలను రద్దుకు ఉపసంహరించు కుఅంటున్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఈ చట్టాల గురించి రైతులను మెప్పించలేకపోయామని ఈ చట్టాలు రైతులకు ఉపయోగమనే పద్ధతిలో ఉన్నాయని ప్రభుత్వం సమర్థించుకుంటోంది తప్ప చిత్తశుద్ధితో ఈ చట్టాలను రద్దు చేయడం లేదు ప్రభుత్వం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దొంగ నాటకాలు విడనాడి వెంటనే చట్టాలను రద్దు చేయాలని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని. చనిపోయిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషయా చెల్లించాలని ఇంట్లో ఉద్యోగం పునరావాస కేంద్రాలు కల్పించాలని మరణించిన రైతుల గుర్తింపుగా ఢిల్లీలో అమరవీరుల స్తూపం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని  ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రెటరీ.