రాములు 7వ వర్ధంతి వేడుకలు

Published: Wednesday May 12, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు నాయకుడు కునపురి రాములు 7 వ వర్ధంతి సందర్భముగా ఆయన స్థూపం వద్ద ఆయన భార్య మార్కెట్ కమిటీ చైర్మన్ కూనపురి కవిత ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో హమాలీలకు 100 మందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కీసర కిరణ్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.