మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎండీ హైమద్

Published: Monday June 28, 2021
మల్లాపూర్, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నర్సింగరావు, కృష్ణా రావు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మైపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మల్లాపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వాల్గోండ కు చెందిన ఎండీ హైమద్ ను నియమించారు. ఈ కార్యక్రమం మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుండ్రా శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వాకిటి సత్యంరెడ్డి, కంది బుచ్చిరెడ్డి, కోటగిరి ఆనంద్, గౌడ్ మరిపెల్లి, మల్లన్న రాజశేఖర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, తోట సంతోష్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.