నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనయే ధ్యేయంగా యూత్ ఫిజికల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా.. హైదరాబ

Published: Friday December 23, 2022
యూత్ ఫిజికల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ గత రెండు సంవత్సరాలుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతకు ఫిజికల్ ట్రైనింగ్ లో శిక్షణ నిచ్చి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తుందని అన్నారు ఆ సంస్థ డైరెక్టర్ మనీష్ కుమార్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుతం తమ సంస్థ లో 160 మంది ఫిజికల్ టీచర్స్ గా పని చేస్తున్నారన్నారు. నాలుగు నెలల నుండి వీరికి నెల నెల 16500 జీతాభత్యాలను ఇస్తున్నామని తెలిపారు. ప్రతీ ఉద్యోగికి జీవిత భీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. అటువంటి తమ సంస్థ పై అసత్య ప్రచారాలు కొంతమంది చేస్తున్నారని, వారిపై ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.తమ సంస్థ లో యోగ, మార్షల్ ఆర్ట్స్, జూడో, లేడీస్ సెల్ఫ్ డిఫెన్స్ లాంటి వాటిలో మూడు నెలల శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో ఆయన తో పాటు ఎం. సత్యనారాయణ, కె. మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.