*ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడుతున్న ఐబీ ప్రాంతంలోనే మాతా శిశు ఆసుపత్రిని నిర్మించాలి* -ఆమ్ ఆద్మ

Published: Thursday November 10, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 09, ప్రజాపాలన: ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడుతున్న ఐబీ ప్రాంతంలోనే మాతా శిశు ఆసుపత్రిని నిర్మించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తా లోని నూతనంగా నిర్మించబోతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆవరణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ 18 కోట్లతో నూతనంగా  జిల్లా కేంద్రంలోని గోదావరీ ఒడ్డున నిర్మించిన మాతా శిశు ఆసుపత్రి ప్రజలకు సేవలు అందించడంలో మూడునాళ్ళ ముచ్చటగా మారిందంటూ  విమర్శించారు. మాతా శిశు ఆసుపత్రి వరదల కారణంగా పూర్తిగా నీటిలో మునిగి నిరుపయోగంగా మారింది అన్నారు.   ఆసుపత్రిలో ఉన్నటువంటి కొట్లారుపాయలు విలువ చేసే ఆధునాతన పరికరాలు కూడా పూర్తిగా నీటిమట్టమై పాడైపోయాయని ఇప్పుడు ఆసుపత్రి, పరికరాలు ఎందుకు పనికిరాకుండా మారాయని వాపోయారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు మొద్దు నిద్ర విడి జిల్లా నడిబొడ్డున ఉన్న ఐబీ ప్రాంతంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలంలో నూతన మాతా శిశు ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఆసుపత్రికి ఎదురుగా మాతా శిశు ఆసుపత్రి ఉండడం ద్వారా శిశువులకు ఈ ఎన్ టి, ఆర్థోపెడిక్, ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉంటే వెనువెంటనే జిల్లా ఆసుపత్రిలోకి తీసుకెళ్లడానికి అనువుగా ఉంటుందని  దూర ప్రాంతాల నుండి వచ్చే గర్భిణీ స్త్రీలకు దూర భారం తగ్గి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో  ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు నల్లా నాగేంద్ర ప్రసాద్, నయీం పాషా, చింతకింది తిరుపతి, 
కొంటు రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు మిడివెల్లి సతీష్, తదితరులు పాల్గొన్నారు