మధ్యాహ్నం భోజన పథకం కార్మికుల సమస్యలు* పరిష్కరించాలని*యాచారం మండల విద్యా వనరుల అధికారి కార్

Published: Tuesday July 05, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి పెరిగిన ధరలకు అనుగుణంగా మేనూ చార్జిలు పెంచాలని  పెండింగ్ బిల్లులు వేతనాలు వెంటనే చెల్లించాలని,  గుడ్డుకు అదనపు ధర ఇవ్వాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన వేతనం వెంటనే ఇవ్వాలని, కార్మికులకు రెండు జతల కాటన్ బట్టలు వంట సామాగ్రి ఇవ్వాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తదితర సమస్యలతో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం సి ఆర్ పి లు చంద్రయ్య. రాజు మల్లేష్ లకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల బ్రాహ్మయ్య, మంగమ్మ, పార్వతమ్మ, ప్రభావతి, సంగీత ,కలమ్మ, వెంకటమ్మ, సుజాత, రాణి, ధనమ్మ, యశోద,
నరసమ్మ ,తదితరులు పాల్గొన్నారు.