ప్రైవేట్ ఆస్పత్రులలో ఉచిత వైద్యం అందించాలి

Published: Wednesday May 12, 2021

ప్రతి కుటుంబానికి రూ10 వేలు వారి అకౌంట్లో వేయాలి,
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్,


ఆసిఫాబాద్ జిల్లా, మే11 (ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేలా తగు చర్యలు తీసుకోవాలని మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు జరుగుతుండడంతో లాక్ డౌన్ విధించడం హర్షించదగిన విషయమే అన్నారు. కానీ లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఆకలితో అలమటించి చనిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గత సంవత్సరం లాక్ డౌన్ సమయములో ఎంతోమంది ఆకలితో విగత జీవులుగా మారారని, నేడు ప్రకటించిన లాక్ డౌన్ లో అలాంటి దుర్ఘటనలు ఎదురవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ10 అకౌంట్లో జమ చేసి ప్రజలను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట, స్కూల్ కాలేజీలను, ఐసోలేషన్ కేంద్రాలుగా ఏర్పాటుచేసి ఉచిత వైద్యం, భోజన వసతులు కల్పించాలని సూచించారు. కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ ఉచితంగా వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లూరి లోకేష్, గోడిసెల కార్తీక్, తదితరులు ఉన్నారు.