సైబర్ నేరాలు అవగాహన సదస్సు నిర్వహించిన చందానగర్ పోలీసులు

Published: Friday July 30, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలోన ప్రజలకు చందానగర్ పోలీస్ అధికారులు ఎస్ ఐ వెంకటేష్ పోలీస్ సిబ్బంది సైబర్ నేరాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య కాలనీ అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ మాట్లాడుతూ సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు ఫోన్ లో వచ్చే మెసేజ్ లు ద్వారా మీకు బహుమతులు ఇస్తామని ఫలానా హోటల్ కి రమ్మని పిలుస్తారు అక్కడ మాయమాటలు చెప్పి మనతో డబ్బులు కట్టించుకుంటారు దయచేసి ఇలాంటి మోసాలకు గురి కాకండి కొత్త నంబర్ తోని వచ్చే మెసేజ్ లు గాని మేం ఫలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాను అని మీ ఓటీపీ చెప్పమని అడిగిన వారికి రెస్పాండ్ కాకుండా ఎవరికీ మన పూర్తి పాస్వర్డ్ గాని బ్యాంక్ డీటెయిల్స్ కానీ అకౌంట్ గాని ఆధార్, గాని డెబిట్ కార్డ్ నెంబర్ క్రెడిట్ కార్డ్ ఓటిపి నెంబర్లు గాని ఎవరు అడిగినా ఇవ్వకూడదు ఇవ్వడం వల్ల మన అకౌంట్లో నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు ఆన్లైన్ ద్వారా వి డ్రా చేసుకుంటారు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండి ఆన్లైన్ మోసాలకు గురి కుండా ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని చందానగర్ పోలీస్ సిబ్బంది అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ గుల్మొహర్ పార్క్ బాల్రాజ్ సాగర్, శివ, చింటూ, చంద్రశేఖర్, రాజు, కృష్ణ, అశోక్, మోహన్, యువరాజ్, దేవదాస్, మాధవ్, శివ కుమార్, యశ్వంత్, రఘు, జై వేలు, మాసయ్య, యువజన నాయకులు పాల్గొన్నారు