రైతుల ధాన్యం కొనుగోలులో జరిగే దోపిడీని అరికట్టాలి

Published: Wednesday May 26, 2021
కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి
కోరుట్ల, మే 25 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు, క్రిష్ణ రావుల ఆదేశానుసారం కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రైతుల యొక్క ధాన్యం తూకం వేసేటపుడు, రైస్ మిల్లర్లు లో జరుగుతున్న దోపిడీ ని అరికట్టాలని రెవెన్యూ డివిజనల్ అధికారి సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలోని రైస్ మిల్లుల యాజమాన్యాలు దాన్యం కొనుగోలు విషయంలో రైతులను భారీ ఎత్తున మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ప్యాక్స్ సొసైటీల ద్వారా నియోజకవర్గంలో దాన్యం కొనుగోలు చేస్తున్నారు ధాన్యం వేయడానికి ముందే మ్యాచర్ వచ్చాకనే తుకం వేస్తున్నారు. ఆ సమయంలో క్వింటాళ్లకు రెండున్నర కిలోల చొప్పున కోత విధిస్తున్నారు. ఆ తర్వాత రైస్ మిల్లర్లు ఐదు కిలోల చొప్పున కోత విధిస్తున్నారు. ఈ రకంగా ఒక రైతు ఒక క్వింటాలుకు ఏడున్నర కిలోల చొప్పున నష్టపోతున్నారు. ప్రభుత్వం స్వయంగా రైతుల నుండి కొనుగోలు చేసి ధాన్యం లో నుండి ప్రైవేట్ రైస్ మిల్లులు అక్రమంగా దోపిడీ చేస్తున్నారని కావున అధికారులు వెంటనే స్పందించి అక్రమాలు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు యం.ఏ నయీమ్, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, కాంగ్రెస్ నాయకులు రసూల్, యువజన కాంగ్రెస్ నాయకులు అంజి రెడ్డి, కిషోర్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.