గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కోటి వృక్షార్చన: సంజయ్, శ్రావణి, శ్రీనివాస్, శ్రీకాంత్, అరుణ శ్రీ

Published: Thursday February 18, 2021

జగిత్యాల, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన): బంగారు తెలంగాణ నిర్మాత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ శ్రావణిప్రవీణ్, వైస్ ఛైర్పర్సన్ గోలి శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతీ ప్రసాద్, వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు జుంబర్తి రాజ్కుమార్, ఒద్ధి శ్రీలత రామ్మోహన్, కౌన్సిలర్లు, కో.అప్షన్ మెంబర్లు, తెరాస పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, మున్సిపల్ అధికారులు, మేప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.