ఘనంగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు

Published: Friday August 06, 2021
మేడిపల్లి, ఆగస్ట్5 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవి కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతో కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ గౌడ్, సర్వ బాబు యాదవ్, జనం పల్లి వెంకటేశ్వర్ రెడ్డి, వనంపల్లి గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, గాయం శ్రీధర్ రెడ్డి, పరిటాల సాంబశివరావు, సూర్యం శంకర్, జెసిబి రాజు, సాయి అద్వైత రెడ్డి, మహేష్ గౌడ్, పరశురాం, సాజిద్ రాఖి, రాజశేఖర్, అభిషేక్ తదితరులు ఉన్నారు.