ఆత్కూరు గ్రామంలో బిఆర్ఎస్, గడపగడపకు కేసీఆర్ సంక్షేమం కార్యక్రమం

Published: Wednesday April 05, 2023
మధిర, ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి:ప్రతి గడపకు చేరుతున్న కెసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలుఅభివృద్ధి, సంక్షేమం లో దేశానికే తెలంగాణ ఆదర్శం.కేసీఆర్ పాలనలో మారుతున్న గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని,
మూడోసారి బీఆర్ఎస్ పార్టీదే అధికారం ఖాయమని మధిర మండలం ఆత్కూరు గ్రామంలో జరిగిన పల్లె పల్లెకు బీఆర్ఎస్, గడపగడపకు కేసిఆర్ సంక్షేమం కార్యక్రమంలో జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కుమార్ రాజ్, భారత్ రాష్ట్ర సమితి అధినేత ఆదేశాల మేరకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మధిర నియోజకవర్గంలో బుధవారం పల్లె పల్లెకు బిఆర్ఎస్, గడపగడపకు కేసిఆర్ సంక్షేమం కార్యక్రమంలో జడ్పీ చైర్మన్, పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు, ఆత్కూరు సర్పంచ్ అబ్బూరి సంధ్యారాణి తో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో విస్తృతంగా పాదయాత్రగా తిరుగుతూ ప్రజల ఇళ్లకు నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం నుండి అందిస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అడిగి తెలుసుకున్నారు. అలానే వాటి అమలు తీరును వారికి వివరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి గడపకు కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేరుతున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం లో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామాల్లో పల్లె ప్రగతి చేపట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు గ్రామాల్లో పంచాయతీ లకు ట్రాక్టర్లు అందించడం తో పాటుగా మల్టీ పర్పస్ వర్కర్స్ ని ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులు పట్టణాల తో పాటుగా గ్రామాల్లో చేపించడం జరుగుతోందని, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాలు, పల్లె పకృతి వనాలు, రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రైతు బంధు, రైతుబీమా ,వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా, గ్రామాల్లో కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్, కేసీఆర్ కిట్టు, సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం లాంటి సంక్షేమ పథకాలు ఎదో రూపంలో ప్రతి గడపకు చేరుతున్నాయని తెలిపారు ప్రస్తుత కేసీఆర్ గారి పాలనలో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని పల్లెల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీదే అధికారం అన్నారు. ఇంటింటికి వెళుతున్న సమయంలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.