పల్లెల్లో 5జి వైఫై సేవలు-ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శంకరపట్నం ఫిబ్రవరి 24 ప్రజాపాలన రిపోర్టర్

Published: Saturday February 25, 2023

శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో శుక్రవారం జరిగిన దళిత బంధు యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దళితులు అన్ని విభాగాల్లో అభివృద్ధి చెందేందుకు తెలంగాణలో కేసీఆర్ ఒక వినూత్న ప్రయత్నంలో భాగంగానే ఈ దళిత బంధు కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టారని, ఈ పథకం దళితులకు ఒక వరం లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే  18021 యూనిట్లు లబ్ధిదారులకు అందజేశారని మిగతా వారి కూడా విడుదలవారీగా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే లబ్ధిదారులు యూనిట్ల ఎంపికలో కొన్ని ప్రత్యేకమైన వాటిని ఎన్నుకొని అభివృద్ధి చెందాలని అందరూ ఒకే పంతాలో పోకూడదని ఆయన అన్నారు అందులో భాగంగానే శుక్రవారం లింగాపూర్ లో ప్రారంభించిన యూనిట్  రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రత్యేకత కలిగిన ఇంటిగ్రేటెడ్ వైఫై, పరికరాల అమ్మకం కేంద్రాన్ని  ఇక్కడ ప్రారంభించడం అభినందనీయమన్నాడు. అనంతరం ఫైబర్ గ్రిడ్ వైఫై సంస్థ ప్రతినిధి ఆశిష్ మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ముఖ్యంగా ప్రతి పల్లెలో 5జి, వైఫై సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెక్నో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతి పల్లెలో వారి సేవలు ప్రారంభించినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరారెడ్డి, సంస్థ ప్రతినిధులు రవి పటేల్ తదితరులు పాల్గొన్నారు.