ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు

Published: Saturday April 15, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 14 (ప్రజాపాలన ప్రతినిధి)
 ఉప్పల్ సర్కిల్ పరిధిలో  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ రింగ్ రోడ్లో స్థానిక కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు,ఉప్పల్ మున్సిపల్ మాజీ చైర్మన్ మేకల శివారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి ఏసురి యాదగిరిలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. హబ్సిగూడ చౌరస్తాలో మధుర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.