సుకన్య సమృద్ధి యోజన పాసుబుక్కులను పంపిణీ చేసిన కార్పొరేటర్

Published: Saturday October 29, 2022
మేడిపల్లి, అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి)
 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  బడుగు, బలహీన వర్గాల కొరకు బృహత్తరమైన స్కీం సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టడం ఆనందనీయమని రామంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పేర్కొన్నారు. ఆడపిల్ల పుట్టిన అర్హులైన ప్రతి ఇంటిలోని ఆడ పిల్ల పుట్టినప్పటి నుండి పది సంవత్సరాల అమ్మాయి వరకు ఈ స్కీం వర్తిస్తుందని, నెలకు రూ1000 రూపాయల చొప్పున 15 సంవత్సరాలు చెల్లించినట్లయితే అమ్మాయికి 21 సంవత్సరం వచ్చేనాటికి రూ 5 లక్షలు రూపాయలు, ఎడ్యుకేషన్ లోన్స్, మొదలైనవి లభిస్తాయని తెలిపారు. రామంతాపూర్ డివిజన్ కార్యాలయంలో గత వారం కిందట సెంటర్ ను పెట్టించి డివిజన్లోని బడుగు, బలహీన వర్గాల ఆడపిల్లలకు తన జిహెచ్ఎంసి నుండి వచ్చే జీతంను నుండి 20 మంది ఆడపిల్లలకు బీమా చేయించారు. దానికి సంబంధించి పాస్ పుస్తకాలను కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు, సూపరిండెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని అర్హులైన వారికి పాసు పుస్తకాలను అందజేశారు. 
అనంత కార్పొరేటర్ మాట్లాడుతూ రామంతాపూర్లో ఎవరైనా నీరు పేద బడుగు, బలహీన వర్గాల అర్హులైన ఆడపిల్లలు తప్పకుండా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  అంబర్పేట్ పోస్ట్ ఆఫీస్ మేనేజర్ సుభాష్ నాయక్, పుష్ప రాజ్ సింగ్, శ్రీ మనీ, జనార్ధన్, రామకృష్ణ, సురేష్, రవి, సత్తయ్య, సుమలత తదితరులు పాల్గొన్నారు.