గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తుల అరెస్టు

Published: Tuesday October 26, 2021

కోరుట్ల, అక్టోబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల సీఐ రాజశేఖర రాజు, మేడిపల్లి ఎస్సై సుధీర్ రావు, కోరుట్లఎస్సై సతీష్ లకు లభించిన సమాచారం మేరకు మేట్ పల్లి డిఎస్పీ రవీందర్ రెడ్డి ఆదేశానుసారం మేడిపల్లి ఎస్సై సుధీర్ రావు, కోరుట్ల ఎస్సై సతీష్, ట్రైనీ ఎస్సైలు నినిషా రెడ్డి,సురేష్ మరియు రజితలు, మేడిపల్లి సిబ్బంది అనిల్ కుమార్, అజీజ్, కోరుట్ల సిబ్బంది సంపత్, గంగాధర్ లో కలిపి ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామ శివారు జోగన్ పల్లి వెళ్లే దారిలో సోదాలు నిర్వహించి అనుమానస్పదంగా వున్న రెండు మోటారు సైకిళ్లపై వెళ్తున్న నాగపూర్ - దంతాలపల్లి గ్రామానికి చెందిన మాడవి మాణిక్ రావు, రాయికల్ మండలం కుమ్మర్ పల్లి గ్రామానికి చెందిన బోల్లే విష్ణు, కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామానికి చెందిన బంగారు తరుణ్, సిద్దే శుభాష్ అనుమానాస్పదంగా కనిపించగా పోలీసుల ఆధ్వర్యంలో మేడిపల్లి తహసిల్దార్ బషీర్ విచారించగా ఈ నలుగురి వ్యక్తుల వద్ద 1కేజీ.05 గ్రామ్ ఎండు గంజాయి లభించింది, ఈ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకొని, వీరిని విచారించగా ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ మండలం నాగపూర్-దంతన్ పల్లి గ్రామ శివారు నందు తన అయిదు ఎకరాల వ్యవసాయ భూమి లో ఐదు సంవత్సరాల నుండి గంజాయి సాగు చేస్తూ చుట్టుపక్కల గ్రామాల, జిల్లా యువకులకు విక్రయించి జీవనం సాగిస్తున్నాడు. మడవి మాణిక్ రావు తన గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో పండిస్తున్న పంటలు సైతం అధికారికంగా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మాణిక్యరావు గతంలో జగిత్యాల జిల్లాలో ఉండి ప్రస్తుతం కడెం మండలం బెల్లాల గ్రామంలో ఉంటున్న  జల్లపల్లి తరుణ్ పరిచయమై గంజాయికి బానిసై  చివరకు అతను కూడా వ్యాపారంలో దిగాడు. అదేవిధంగా కాలక్రమంలో స్నేహితులైన బొల్లే విష్ణు, బంగారు తరుణ్, సిద్దే సుభాష్, కూడా గంజాయి కూపం లోకి దిగి వ్యసనానికి బానిసై చివరికి తన స్నేహితులను గంజాయి అమ్మటం మొదలు పెట్టారు. ఈ విధంగా గత రెండు సంవత్సరాలుగా జరిగిన వ్యాపారానికి అడ్డుకట్ట వేసిన కోరుట్ల సీఐ రాజశేఖర రాజు, మేడిపల్లి ఎస్సై సుధీర్ రావు, కోరుట్ల ఎస్ ఐ సతీష్, మేడిపల్లి పోలీస్ సిబ్బంది అనిల్ కుమార్, అజీజ్, కోరుట్ల సిబ్బంది సంపత్, గంగాధర్ లను జిల్లా ఎస్పీ సిందు శర్మ, మేట్ పల్లి డిఎస్పీ రవీందర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా గంజాయి పండించిన, కలిగి ఉన్న, సేవించిన, రవాణా, చేసిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.