డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలి

Published: Tuesday June 29, 2021
మధిర, జూన్ 28, ప్రజాపాలన ప్రతినిధి : అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో మధిర ప్రభుత్వ హాస్పటల్ లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు మరియు ఖాళీగా ఉన్న మిగతా పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలని, ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా చౌక్ లో రిలే నిరాహార దీక్ష చేస్తున్న అఖిలపక్ష నాయకులు, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత కొంత కాలంగా మధిర గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిస్థాయిలో వైద్యులు లేరని అనేక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మరియు వామపక్షాలు పార్టీల ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం జరిగింది ఇప్పటివరకూ జిల్లా వైద్యాధికారి గాని, జిల్లా కలెక్టర్ గారిని స్పందించి ఆ పోస్టులు భర్తీ చేయలేదు ఈ మధ్యకాలంలో మధిర కు హెల్త్ డైరెక్ట్ వచ్చిన రోజు కూడా అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో వారిని కలిసి మెమొరాండం ఇస్తే సమస్యను పరిష్కరిస్తానని మాట ఇచ్చినారు కానీ ఇప్పటివరకు ఆ పోస్టులను భర్తీ  చేయలేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యను తక్షణ పరిష్కారం చేయాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్ చేసినారు, లేనిపక్షంలో రిలే నిరాహార దీక్షను, ఆమరణ నిరాహార దీక్ష చేయటానికి కూడా వెనుకాడబోమని వారన్నారు, ఈ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నవారు, మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సూరం శెట్టి కిషోర్, మండల అధ్యక్షులు, దా రా బాలరాజు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి, చావా మురళీకృష్ణ, మండల కార్యవర్గ సభ్యులు అన్నవరం సత్యనారాయణ, బిజెపి పట్టణ అధ్యక్షులు, పాపట్ల రమేష్, మాది రామ్ సాయి రాం తదితరులు పాల్గొన్నారు, ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన వారిలో, సిపిఐ town సెక్రటరీ, బెజవాడ రవి, మధిర పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిరియాల వెంకటరమణ గుప్తా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, చావా వేణు, మధిర మున్సిపల్ కౌన్సిలర్, కో నాదని కుమార్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు, తూమాటి నవీన్ రెడ?