లింగ వివక్షత లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం ** జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ** 2022 పోస్టర్స్ ను విడుద

Published: Tuesday December 06, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 5 (ప్రజాపాలన,ప్రతినిది) :
జిల్లా పోలీస్ కార్యాలయంలో లింగ వివక్షత లేని సమాజం కోసం జాతీయ ఉద్యమం 2022 పోస్టర్ ను జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సురేష్ కుమార్ మాట్లాడుతూ లింగ వివక్షత లేని సమాజ ఏర్పాటు కోసం షీ టీంలు పనిచేస్తున్నాయని ఎస్పీ  పేర్కొన్నారు.
విద్యార్థులు మహిళలపై హింస ఈవ్ టీజింగ్ సైబర్ క్రైమ్ లకు ఎవరైనా గురి అయినట్లయితే వెంటనే షీ టీం ను సంప్రదించాలని సూచించారు ఏదైనా అత్యాసర సమయంలో డయాల్ 100 కు కాల్ చేయాలని, లేదా షీ టీం ఆసిఫాబాద్ 8333986783 నెంబర్ కు సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి.సి.ఆర్.బి  సి.ఐ శ్రీనివాస్, ఎస్.బి సి.ఐ సుధాకర్, ఆసిఫాబాద్ సి.ఐ రాణా ప్రతాప్, ఆసిఫాబాద్ షి టీం ఇంఛార్జి సునీత, షి టీం సభ్యులు స్వప్న, శ్రీలత లు పాల్గొన్నారు .