ఆశా వర్కర్ల లకు 4జి సిమ్ కార్డ్ లను పంపిణీ

Published: Friday November 26, 2021
హైదరాబాద్ 25 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి: ఆశా వర్కర్ల లకు 4జి సిమ్ కార్డ్ లను పంపిణీ చేసిన దేవరుప్పల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ కిషోర్ తాల్క. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ను సాంకేతిక పరిజ్ఞానంతో నూతనీకరించాలనే దృక్పథంతో చాలా బాగుందన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది కి మరియు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవడానికి 4జి సిమ్ కార్డ్ లను పంపిణీ చేయాలని నిర్ణయించడం శుభసూచకం మని దేవరుప్పల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి అన్నారు. హెల్త్ డ్యూటీ ఏరియా మరియు హెడ్‌ క్వార్టర్స్‌ లోని క్షేత్ర స్థాయి కార్యకర్తల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉండేలా చేసే ప్రయత్నాల్లో భాగంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవరుప్పల ఆశా వర్కర్లకు 4జి సిమ్‌ కార్డ్‌లను వైద్య అధికారి బేస్తవారం నాడు కార్యాలయంలో సంబంధిత ఆశా వర్కర్ల కు పంపిణీ చేశారు. ఈ నూతన సాంకేతిక విధానంతో రిపోర్ట్ పద్దతి మెరుగు పడుతుందని వైద్య అధికారి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మెరుగైన సేవలను అందించగలమని అభిప్రాయపడ్డారు.