విద్యా సంస్థల వసతి గృహాలను కరోనా ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చాలి : బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ

Published: Tuesday May 18, 2021
జగిత్యాల, మే 16, (ప్రజాపాలన ప్రతినిధి): కరోనా రెండో దశ వేగంగా విజృంభిస్తున్నా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ విద్యాసంస్థలను ఐసొలేషన్ కేంద్రాలుగా మార్చాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గాజుల నాగరాజు డిమాండ్ చేసారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన మాట్లాడుతూ కరోనా బాధితులకు ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్లు కూడా సరిపోవడం లేదని అదే విదంగా కిరాయి ఇండ్లలో నివసించే వారికి కరోనా వస్తే ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని  అందుకోసము ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల వసతి గృహాలను నిబంధనలతో ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చలని ప్రభుత్వాన్ని కోరారు చేశారు.