వైభవంగా శ్రీ శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ కల్యాణం

Published: Friday February 18, 2022

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 17 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని వర్ష కొండ గ్రామంలో బుధవారం రోజున శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చెన్నమనేని లత శ్రీనివాస రావు స్వామి వారికి 51116 స్వామి వారికి కట్నంగా సమర్పించుకున్నారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు టీవీ సత్యం విశ్వబ్రాహ్మణ జగిత్యాల పట్టణ అధ్యక్షుడు వెంకటరమణ మరియు ఇబ్రహీంపట్నం విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు మదనపల్లి జలంధర్ సంఘ సభ్యులు శ్రీధర్ సతీష్ సంతోష్ మురళి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు