చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ని రద్దు చేయాలి.. --మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ.శ్రావణి

Published: Thursday October 27, 2022

 

జగిత్యాల, అక్టోబర్, 26 ( ప్రజాపాలన ప్రతినిధి): చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ని రద్దు చేయాలని జగిత్యాల  ప్రజల పక్షాన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ.శ్రావణిప్రవీణ్  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్  ప్రధాని నరేంద్ర మోడీ కి ఒక పోస్ట్ కార్డు ని రాశారు. ఈ సందర్భంగా  చైర్పర్సన్ మాట్లాడుతూ చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. స్వాతంత్ర్య ఉద్యమంలో యావత్ భారత జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలు పైన పన్ను వేసిన తొలి ప్రధాని మోడీ యేనని విమర్శించారు. దేశంలో రెండో అతిపెద్ద రంగమైన చేనేతపై వెంటనే పన్నును రద్దు చేయాలని చైర్పర్సన్ డా.భోగ.శ్రావణిప్రవీణ్ పోస్ట్ కార్డులో తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చెర్మెన్ గోలి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ ఫోరమ్ ఉపాధ్యక్షులు బొడ్ల జగదీష్, కౌన్సిలర్స్ తోట మల్లికార్జున్, ముస్కు నారాయణ రెడ్డి, కోరే గంగమల్లు, అల్లే గంగసాగర్, కూతురు రాజేష్, పిట్టా ధర్మరాజ్,నాయకులు బలే శంకర్, సుల్తాన్ ఉద్దీన్ అహ్మద్, బద్ధం జగన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.eజగిత్యాల, అక్టోబర్, 26 ( ప్రజాపాలన ప్రతినిధి): చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ ని రద్దు చేయాలని జగిత్యాల  ప్రజల పక్షాన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ.శ్రావణిప్రవీణ్  ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. చేనేత కార్మికుల సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వచ్చేందుకు లక్షలాదిగా ఉత్తరాలు రాయాలని మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్  ప్రధాని నరేంద్ర మోడీ కి ఒక పోస్ట్ కార్డు ని రాశారు. ఈ సందర్భంగా  చైర్పర్సన్ మాట్లాడుతూ చేనేత వస్త్రాలు, చేనేత ఉత్పత్తులపై ఉన్న ఐదు శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను వేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. స్వాతంత్ర్య ఉద్యమంలో యావత్ భారత జాతిని ఏకతాటిపై నడిపించిన చేనేత వస్త్రాలు పైన పన్ను వేసిన తొలి ప్రధాని మోడీ యేనని విమర్శించారు. దేశంలో రెండో అతిపెద్ద రంగమైన చేనేతపై వెంటనే పన్నును రద్దు చేయాలని చైర్పర్సన్ డా.భోగ.శ్రావణిప్రవీణ్ పోస్ట్ కార్డులో తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చెర్మెన్ గోలి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ ఫోరమ్ ఉపాధ్యక్షులు బొడ్ల జగదీష్, కౌన్సిలర్స్ తోట మల్లికార్జున్, ముస్కు నారాయణ రెడ్డి, కోరే గంగమల్లు, అల్లే గంగసాగర్, కూతురు రాజేష్, పిట్టా ధర్మరాజ్,నాయకులు బలే శంకర్, సుల్తాన్ ఉద్దీన్ అహ్మద్, బద్ధం జగన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.e