ఆరోగ్యం మహాభాగ్యంవిద్యార్థులకు ఆరోగ్యరక్షణ పై అవగాహన మధిర రూరల్

Published: Friday August 26, 2022
ఆగస్టు 25 ప్రజా పాలన ప్రతినిధిమండల పరిధి లోని గురువారంం నాడు పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా. శశిధర్ సూచన ల మేరకు పారామెడికల్ బృందం ఆధ్వర్యంలో చిలుకూరు హైస్కూల్ హెచ్ఎమ్ వూట్ల శంకర్ రావు మరియు ఉపాధ్యాయ బృందం సంయుక్తంగా విద్యార్థిని విద్యార్థులకు పలు ఆరోగ్య సూత్రాలు హెచ్ఎస్ లంకా కొండయ్య బృందం సంపూర్ణ ముగా వివరించారు. ఇందులో భాగంగా వ్యక్తిగత పరి శుభ్రత, చేతులు శుభ్రo, ఆరోగ్యానికి భద్రం అంటూ పలు విషయాలు బోధించారు. హ్యాండ్ వాష్ గురించి డెమోనిస్ట్రేషన్ చేసి చూపించినారు. పరిసరాల్లో పెరిగే హానికరం ఐన వయ్యారి భామ మొక్కలు గురించి వాటి నివారణ గురించి లంకా
కొండయ్య సంపూర్ణముగా వివరించారు.
 ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎమ్ మరియు ఉపాధ్యాయ సిబ్బంది స్థానిక ఎఎన్ఎమ్ నాగమణి  ఆశ కార్యకర్త సుధ, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.