వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు

Published: Monday January 17, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 16 జనవరి ప్రజాపాలన ప్రతినిధి: వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. భువనగిరి లోని నవ్య నర్సింగ్ హోం డాక్టర్.పద్మజా సంతాన సాఫల్య కేంద్రం సహకారంతో సంక్రాంతి పండుగ సందర్భంగా జీనియస్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో 16 తేదీన ఉదయం ముగ్గుల పోటీలను నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన యువతులు మహిళలు ఉత్సాహంగా సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొని ఆవరణం అంతా రంగులతో నింపారు. పోటీలో ప్రథమ ద్వితీయ బహుమతులతో పాటు పలువురికి ప్రోత్సాహక బహుమతులను నిర్వాహకులు అందజేశారు.