అక్రమంగా నా ఇంటి స్థలంలో ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ తొలగించాలి

Published: Tuesday March 29, 2022
వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్
ఇబ్రహీంపట్నం మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి : మంచాల మండలం  అరుట్ల గ్రామంలోని  భూమి నా ఇంటి స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను తొలగించాలని డిమాండ్ చేస్తు మంచాల మండలం ఎంపీ డిఓ అధికారి చిలుకురి. శ్రీనివాస్ కు వినతి పత్రం ఇచ్చిన వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అరుట్ల గ్రామంలో ని గ్రామ కంఠం భూమి సర్వే నెంబర్ 1039లో నాకు ఇంటి స్థలం సర్టిఫికెట్ ప్రభుత్వం పంపిణీ చేసింది నేను గ్రామంలో లేని సమయంలో గ్రామ సర్పంచ్ గతంలో పనిచేసిన కార్యదర్శి జనార్దన్ రెడ్డి కలిసి నాకు కేటాయించిన స్థలంలో అక్రమంగా నాకు సమాచారం ఇవ్వకుండా ఫౌండేషన్ వారిచే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసారు ఈ విషయం కార్యదర్శిని సంప్రదిస్తే నాకు ఏమి సంబంధం లేదు అంత సర్పంచ్ కే తెలుసు ప్రారంభం చేస్తే వెళ్ళాను నేను వాటర్ ప్లాంట్ కు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు అని సమాధానం ఇచ్చాడు సర్పంచ్ గారిని అడుగుతే నీకు అక్కడ ఇంటి స్థలం ఉన్నది అని నాకు తెలియదు అన్నాడు ఎవ్వరి స్థలం ఉన్నదో అక్కడ అని తెలుసు కోకుండా వాటర్ ప్లాంట్ ఎలా ఏర్పాటు చేస్తారు అని అడుగుతే అక్కడ ఖాళీ స్థలం కనిపించింది  వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించం అహంకారంతో సమాధానం చెప్పాడు సర్పంచ్ గారు నాకు ఏంటి స్థలం కావాలి అంటే మాట్లాడుదాం అని చెప్పి మూడు నెలలు అవుతుంది ఇప్పట్టి వరకు సమాధానం లేదు నా ఇంటి స్థలంలో ఉన్న వాటర్ ప్లాంట్ ను తొలగించాలని గతంలో ఉన్న గ్రామ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి దరఖాస్తు ఇచ్చాను ఇచ్చి మూడు నెలలు దాటినా వాటర్ ప్లాంట్ యజమానికి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు అంటే అధికారులు ప్రజలకు ఇచ్చే గౌరవం ఇదేనా నాలాంటి రాజకీయ నాయకుడికే అన్యాయం జరుగుతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటాదో అర్థం చేసుకోవాలి నేను నాకు కేటాయించిన స్థలంలో ఇల్లు నిర్మించు కోవటానికి రాయి వేయించి ఏర్పాట్లు చేసుకున్నాను కానీ కొంత మంది రాజకీయ నాయకులు నా పై రాజకీయ కక్షతో నాకు ఇల్లు నిర్మాణం కోసం అనుమతి ఇవ్వకుండా ఇప్పట్టి వరకు అడ్డు పడ్డారు ఎప్పుడు ఏకంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసారు  సర్పంచ్ గారిని గౌరవించి ఇప్పట్టి వరకు సమయం ఇచ్చాను అయిన చలనం లేదు అందుకే ఎంపీ డిఓ అధికారికి పిర్యాదు చేసాను వెంటనే అధికారులు స్పందించి నా ఇంటి స్థలంలో అక్రమంగా వాటర్ ప్లాంట్ ఏర్పటుకు సహకరించిన సర్పంచ్ గతంలో ఉన్న కార్యదర్శి పై చర్య తీసుకోవాలి నా ఇంటి స్థలంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను తొలగించి నాకు న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్న లేని పక్షంలో అన్ని ఆధారాలతో కలెక్టర్ గారికి పిర్యాదు చేస్తాను అని హెచ్చరిస్తున్నాను