సాంకేతిక శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం

Published: Wednesday June 23, 2021

మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సావిత్రి
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 22 (ప్రజాపాలన) : మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ ద్వారా వివిధ సాంకేతిక కోర్సులలో శిక్షణ కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి సావిత్రి మంగళవారం  ఒక ప్రకటనలో తెలిపారు. అనాధలు, నిరాశ్రయులైన, ఆడపిల్లలు అక్రమ రవాణాకు గురైన బాధితులు, ఇతర మహిళా సంస్థలో ఆశ్రమం పొందినవారు, వాలి సెట్ రాయని వారు అర్హులని, అభ్యర్థులు తమ ఆదాయ కుల ధ్రువీకరణ పత్రాలను జతపరిచి దరఖాస్తును ఈనెల 28వ తేదీలోగా జిల్లా మహిళా శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల, సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. డిప్లమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్, తదితర కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఆసక్తి, అర్హత గల వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.