విత్తన వినాయకుడి ప్రతిమలను పూజించాలి.

Published: Monday August 29, 2022
పాలేరు ఆగస్టు 28 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
వినాయక చవితి సందర్భంగా ప్రతీ ఒక్కరూ విత్తన గణపతి ని పూజించాలని
 
టీఆర్ఎస్ యువజన నాయకులు కొమ్మూరి నరేష్ కోరారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కు సహకరించాలని కోరారు. నేటి మొక్కలే ప్రజలకు నీడ ను ఇస్తాయని పేర్కొన్నారు. ఈ వినాయక చవితి కి విత్తన గణపతి ప్రతిష్టించాలని సూచించారు. నవరాత్రులు పూర్తయ్యక దానిని ఇంటి పెరట్లో పాడు చేసి సంరక్షించాలని కోరారు. చెట్టుగా ఎదిగేందుకు ప్రతీ రోజు పర్యవేక్షించాల్సిన బాధ్యత అందరి పై ఉందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎత్తయిన విగ్రహాం కాదని, మట్టి గణపతి ని పూజిద్దామని అన్నారు. సామాజిక కార్యకర్తలు విత్తన విగ్రహాల గురించి క్షేత్ర స్థాయిలో విస్త్రుతంగా ప్రచారం చేయాలని సూచించారు. పర్యావరణం బాగుంటే ప్రజలు ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. I