పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తెలు మట్టెలు అందజేసిన గొల్లపల్లి సర్పంచ్ నిశాంత్ రెడ్డి

Published: Thursday May 13, 2021
​గొల్లపల్లి, ఏప్రిల్12 (ప్రజాపాలన ప్రతినిధి) : ​గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన చెవులమద్ది భూమవ్వ గంగయ్యల కూతురు అనిత పెళ్లికి గొల్లపల్లి సర్పంచ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి అండ్ మిత్రులు పెద్దమనస్సుతో ముందుకొచ్చి పుస్తెలు మట్టెలు పెళ్లికి కానుకగా అమ్మాయి తల్లిదండ్రులకు అందజేసి తనదాతృ ​త్వాన్ని చాటుకున్నారు. ​అనంతరం సర్పంచ్ మాట్లాడుతు ఈ అవకాశం నాకు నామిత్రులకు రావడం ఎంతో సంతృప్తి నిచ్చిందని పెళ్లి అనేది నూరేళ్ళ జీవితం ప్రజా ప్రతినిధిగా నాకు అట్టి భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాతోభాగస్వామ్యం చేయాలని నా తోసహకరించిన తోటి మిత్రులు హితులు ముస్కు కరుణాకర్ రెడ్డి రెడ్డి సంఘం గొల్లపల్లి అధ్యక్షులు పీసు తిరుపతి రెడ్డి సందవేణి ప్రభాకర్ సజ్జనపు శ్రీనివాస్ నల్ల మహిపాల్ రెడ్డి క్యాస సతీష్ లకు లబ్ధిదారు కుటుంబ సభ్యులు పెళ్లికి కోవిడ్ సమయంలో సహకరించి ఆదరించిన పెద్దలందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.