ఓటరు జాబితా సవరణ 2022 పకడ్బందీగా చేపట్టారు : ప్రత్యేక కార్యదర్శి శశాంక్ గోయల్

Published: Monday October 11, 2021
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 10 (ప్రజాపాలన) : ఓటరు జాబితా సవరణ కార్యక్రమం 2022 కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారుల సమన్యాయంతో అధికారులు పకడ్బందీగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఈ ఓ ప్రత్యేక  ముఖ్య కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయ ఆవరణలో రూ 1 కోటి 87 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ పి ఎం/ వి వి పి టి / గోదాములను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి శశాంక్ గోయల్ మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ నుండి ఎస్ ఎస్ ఆర్ 2022 కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో చేసే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని, ప్రజలందరికి వివరాలు తెలిపే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. తేదీ 1/1/ 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడంతో పాటు 2/3, ఏపీక్ కార్డులు కలిగి ఉన్న, చిరునామా మారిన, మృతిచెందిన వారి వివరాలు తొలగించడంతో పాటు పేరు వివరాలు ఏమైనా సవరణ ఉన్నట్లయితే సరిచేసుకునే ఈ విధంగా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఓటరు హెల్ప్ న్ వివరాలు, తెలిసేలా ప్రచారం చేయాలని తెలిపారు. జనవరి 5వ తేదీ వరకు ఉన్న నూతన ఓటరు నమోదు పూర్తి చేయాలని, జనవరి 15వ తేదీ నాటికి తుది జాబితా తయారు చేసి సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్ర మంలో ఆసిఫాబాద్, కాగజ్నగర్, రాజస్వ మండల అధికారులు దత్తు, చిత్రు, ఎన్నికల ఉప తహసిల్దార్లు జితేందర్, పోచయ్య, ఆయా మండలాల తహసీల్దార్లు,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.