విత్తనాల అందిస్తున్న సీనియర్ శాస్త్రవేత్త రైతులకు సలహాలు ఇస్తున్న శాస్త్రవేత్తలు మేలైన వి

Published: Wednesday May 25, 2022
మధిర రూరల్ మే 24 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు
రైతులు మేలైన  విత్తనాలను నాటి  అధిక దిగుబడులను సాధించి ఆర్థిక అభివృద్ధి పొందాలని మదిర వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే రుక్మిణీదేవి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక  వ్యవసాయ పరిశోధన స్థానం లో విత్తన మేళ 2022 నిర్వహించారు. ఈ విత్తన మేళాలో మదిర వ్యవసాయ పరిశోధన స్థానంలో రూపొందించిన పెసర, కంది, మినుము విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశోధనా స్థానంలో రూపొందించిన విత్తనాల యొక్క ప్రాముఖ్యత వాటి గుణగణాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. వచ్చే వర్షాకాలం సీజన్ లో పంటలకు ఆశించే చీడపీడలు వాటి నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి శాస్త్రవేత్త కె నాగస్వాతి వివరించారు విత్తనం తో పాటు భూమి సారవంతం పెంపొందించడం పాస్పరస్ ను కరిగించే బ్యాక్టీరియా వినియోగంపై డాక్టర్ జి వేణుగోపాల్ రైతులకు అవగాహన కల్పించారు మట్టి నమూనా సేంద్రియ ఎరువుల వినియోగం పై కోరమండల్ కంపెనీ ప్రతినిధి ఏ రామకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల రైతులు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు కోరమండల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు