శంకరపట్నంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు శంకరపట్నం జనవరి 18 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Thursday January 19, 2023
శంకరపట్నం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఆరిఫ్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్ తపించి చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, గోపి వీరమల్లు, ఎండి సాబీర్, బైరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.