ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు జి.ఆనంద్ ఆకస్మిక మృతికి అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు మద్దెల శివక

Published: Saturday May 08, 2021
స్వర్గీయ శ్రీ ఆనంద్ చేతులమీదుగా బహుముఖ ప్రజ్ఞాశాలి అవార్డు స్వీకరించిన  మద్దెల
సినీ నేపధ్య మధుర గాయకుడు స్వర్గీయ జి.ఆనంద్ ఆకస్మిక మృతి కళారంగానికి తీరని లోటు
అభ్యుదయ కళా సేవా సమితి జిల్లా అధ్యక్షుడు మద్దెల  శివ కుమార్
 
కొత్తగూడం భద్రాద్రి కొత్తగూడం జిల్లా, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : తన ప్రత్యేక మధుర గాత్రంతో తెలుగు సినీ ప్రపంచంలో అద్భుతమైన మరపురాని పాటలను పాడి ఎందరో సంగీత ప్రియుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకు.ని    స్వరమాధురి పేరుతో ఒక సంస్థానం ఏర్పాటు చేసుకుని దేశవిదేశాల్లో దాదాపు 6500 ప్రదర్శనలిచ్చి స్వరమాధురి ఆనంద్ గా పేరుగాంచి   ఎందరో వర్ధమాన కళాకారులను ప్రోత్సహించిన స్వర్గీయ శ్రీ ఆనంద్ మృతి కళారంగానికి తీరని లోటు అని అభ్యుదయ కళ సేవా సమితి అధ్యక్షుడు కవి సినీ గీత రచయిత గాయకుడు సమాజ సేవకుడు మద్దెల శివ కుమార్ ఉద్ఘాటించారు గురువారం రాత్రి కరోనా మహమ్మారి బాధితుడిగా ఆకస్మిక మృతి పొందిన స్వర్గీయ ఆనంద్ మృతికి  అభ్యుదయ కళా సేవా సమితి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపి శ్రద్ధాంజలి ఘటించింది జనవరి 2020 న త్యాగరాయగాన సభలో నివేదిత ఆర్ట్స్ అధినేత శ్రీ సుభాష్ గారి నేతృత్వంలో ఏర్పాటుచేసిన అవార్డుల ఫంక్షన్లో స్వర్గీయ శ్రీ ఆనంద చేతులమీదుగా బహుముఖ ప్రజ్ఞాశాలి అవార్డును పొందడం తాను మర్చిపోలేని మరపురాని అనుభూతి అని మద్దెల అభివర్ణించారు ఒక వేణువు వినిపించెను దిక్కులు చూడకు రామయ్య దూరాన దూరాన తారా దీపం పువ్వుల నడుగు నవ్వుల నడుగు విఠల విఠల ప్రేమ బృందావనం స్నేహబంధము ఎంత మధురము మల్లెల వేళ అల్లరి వేళ నల్ల నల్లని మబ్బు లో నా ఏలియలో ఏలియలో ఎందాక మూడుముళ్ల బంధం ఇలాంటి అద్భుతమైన స్వర్గీయ ఆనంద్ గారు పాడిన మధురమైన పాటలు సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని మద్దెల అభివర్ణించారు తను స్వర్గీయ ఆనంద్ గారు నేను గురించి పాడిన ఒక వేణువు వినిపించెను పాట తనకు ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిందని బీఈడీ కళాశాలలో కల్చరల్ సెక్రటరీగా గెలవడానికి దోహదపడిందని మద్దెల గర్వంగా గుర్తు చేసుకున్నారు ప్రతి వర్ధమాన కళాకారుడు  స్వర్గీయ  జి ఆనంద్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని మద్దెల పిలుపునిచ్చారు స్వర్గీయ జి ఆనంద్ గారి మృతికి సంతాపం తెలిపిన వారిలో మద్దెల తో పాటు హైదరాబాద్ నుండి జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులు శ్రీ గొల్లపల్లి దయానంద్ రావు కళా పత్రిక అధినేత శ్రీ మహమ్మద్ రఫీ శృతిలయ ఆర్ట్స్ అకాడమీ అధినేత గానకోకిల శ్రీమతి ఆమని అక్క గారు ఆదర్శ ఫౌండేషన్ అధినేత సమాజసేవకులు శ్రీకుసుమ భోగరాజు నివేదిత ఆర్ట్స్ అధినేత ప్రముఖ గాయకుడు శ్రీ సుభాష్ అభ్యుదయ కళా సేవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సింగర్ ఆఫ్ సింగరేణి మరియు అపర బాలు అల్లి శంకర్ ప్రముఖ సంగీత దర్శకులు మారపాక కృష్ణస్వామి ప్రముఖ సినీ నటులు టి ధనరాజ్ ప్రముఖ సౌండ్ ఇంజనీర్ నటుడు సుధాకర్ సంగీత దర్శకులు విజయ్ బిక్కు లాల్  జాన్ రత్నం తదితరులు ఉన్నారు