క్రీస్తు జీవితం ఆదర్శనీయం అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ పి సునీల్ కుమార్

Published: Monday December 13, 2021
మధిర డిసెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో 9వ వాహనుమాన్ కాలనీ నందు శనివారం రాత్రి కాళీ మైదానంలో స్థానిక క్రీస్తు సంఘం చర్చ్ పాస్టర్ బ్రదర్ పి శాస్త్రి మరియు సంఘ పెద్దలు ద్వారా ఏర్పాటు చేసిన క్రీస్తు అధ్యత్మిక సువార్త సభ నందు వరంగల్ కు చెందిన అంతర్జాతీయ సువార్తికుడు బ్రదర్ పి సునీల్ కుమార్ మాట్లాడుతూ యేసు ప్రభువు జీవితం మానవాళికి ఆదర్శనీయం అని, ప్రతి మనిషి పాపాలకు దూరంగా ఉండాలని ఓర్పు, సహనం, నిగ్రహశక్తి కల్గి శాంతి ప్రేమ కరుణ దయ కల్గి ఉండాలని ఎదుట వ్యక్తిని ప్రేమించే గుణం కల్గి ఉండాలని సూచించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యేసు క్రీస్తు భక్తులకు ఆత్మీయ విందు భోజనం ఏర్పాటు చేసి కరోనా రూల్స్ పాటిస్తూ దేశ క్షేమం కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేసారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం వరంగల్  సేవకులు బ్రదర్ ఇస్రాయేల్ బ్రదర్ నాగరాజు స్థానిక చర్చ్ పాస్టర్ లు పాల్గొన్నారు.