శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణంలో నీమగ్నులు...

Published: Sunday October 10, 2021
సారంగాపూర్, అక్టోబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల్ ధర్మనాయక్ తండా గ్రామంలో బంజారుల ఆరాధ దైవ స్వరూపుడైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణ పనులు వేగవంతంగా చేపడుతున్నారు. భారతదేశ గొప్ప విప్లవకారుడు బ్రహ్మచారిగా జీవితాంతం బంజారుల కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప యోధుడు కోసం అందరూ అంకిత భావంతో కలసి కట్టుగా సేవాలాల్ గుడి నిర్మాణ పనుల్లో గ్రామస్తులు నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్య సంతోష్ గ్రామ బంజారుల సోదరులు పాల్గొన్నారు.