రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు అప్రజాస్వామికం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీద

Published: Wednesday March 29, 2023
మధిర మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి:కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నోటీస్ ఇవ్వటం అప్రజాస్వామికమని మండల నాయకులు అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయటాన్ని నిరసిస్తూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్* ఆధ్వర్యంలో మధిర ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్,ఆర్వి కాంప్లెక్స్ దగ్గర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి మండల నాయకులు పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయాల్లో కక్షపూరిత వాతావరణాన్ని సృష్టిస్తుందని విమర్శించారు. రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసింది శూన్యంమని ఆరోపించారు. దేశంలో గ్యాస్, డీజిల్, పెట్రోల్, ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య మానవులపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపిందని విమర్శించారు.దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్ర ఉన్న గాంధీ కుటుంబంపై కక్షపూరితంగా ప్రధానమంత్రి మోడీ వ్యవహరించడం దిగుజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కోసం దేశం కోసం అనేక త్యాగాలు చేశారని కొనియాడారు. దేశంలో ప్రతిపక్షాల నాయకులపై సీబీఐ, ఈడీ దాడులు చేయటమే తమ పనిగా కేంద్రం ముందుకు సాగుతుందన్నారు. దాడులకు లొంగిన వారిని తమ పార్టీలో చేర్చుకొని కేసులను మాఫీ చేస్తున్న బీజేపీ, దాడులకు లొంగని వారిని జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన ఎనిమిది ఏళ్లలో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో 95 శాతం ప్రతిపక్షాలపై ఉన్నాయంటే దేశంలో ఎలాంటి పరిస్థితి నెలకొందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గాంధీ కుటుంబం పై కక్ష పూర్వకంగా వ్యవహరిస్తున్న బీజేపీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలే ఓటుతో తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు *చావా వేణు* బి బ్లాక్ అద్యక్షుడు *కందిమల్ల వీరబాబు* మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *సూరంశెట్టి కిషోర్,* మధిర పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు *మిరియాల రమణ గుప్తా* బోనకల్ మండల అధ్యక్షుడు *గాలి దుర్గారావు* , ఎర్రుపాలెం మండల అధ్యక్షులు *వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి* , చింతకాని మండలం అధ్యక్షులు *అంబటి వెంకటేశ్వర్లు* , ముదిగొండ మండల అధ్యక్షుడు *కొమ్మినేని రమేష్*,మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ *రంగా హనుమంతరావు,* ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు *దారా బాలరాజు,* సైదల్లిపురం సర్పంచ్ *పులిబండ్ల చిట్టి బాబు,* ఎస్టీ సేల్ మండల అధ్యక్షులు *బాణావత్ వెంకట రమణ నాయక్,* రొంపిమల్ల సర్పంచ్ *మదార్ సాహెబ్* ,జిల్లా నాయకులు *కన్నెపోయిన గోపి,* కిసాన్ సేల్ అధ్యక్షులు *కొప్పుల గోవిందారావు*
మధిర నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి* , మండల యూత్ అధ్యక్షుడు *అదంకి రవికుమార్* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* , *ఆయిలూరి సత్యనారాయణ రెడ్డి, బోడెపుడి గోపి, కర్నాటి రామారావు, పారుపల్లి విజయ్ కుమార్, బద్రు నాయక్, బిట్ర ఉద్దండయ్య, కలకోట మాజీ సర్పంచ్ బందెలముత్తయ్య, ఆదూరి శ్రీనివాసరావు, మోదుగు బాబు, బండారి నరసింహారావు, ఆదిమూలం శ్రీనివాసరావు, నూర్ మొహమ్మద్, కోటా డేవిడ్* కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.