గ్రామాలలో ప్రధానమంత్రి ఆది ఆదర్శ పథకం అమలు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు.

Published: Wednesday September 28, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ప్రజా పాలన.
 27 సెప్టెంబర్ 22.
     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ప్రాంతాల లో ని గ్రామాలలో ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ పథకం కింద, మౌలిక వసతుల కల్పనకు గ్రామాలను గుర్తించాలని, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతం పో ట్రూ సంబంధిత అధికారులకు ఆదేశించారు. 
      మంగళవారం నాడు తన ఛాంబర్ లో ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామీణ యోజన పథకం కింద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 64 గ్రామాలను గుర్తించడం జరిగిందని, ఒక్కొక్క గ్రామంలో సమస్యలను పరిష్కరించడానికి గ్రామానికి 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని, దీనిలో మొదటిగా 20 గ్రామాలకు నిధులు మంజూరయ్యాయని ,,ప్రతి గ్రామంలో విద్యా ,వైద్యం, పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్, మంచినీరు, అంగన్వాడి సెంటర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం, అదే విధంగా కరెంటు, గ్రామాలలో ప్రజలకు అవసరమైన వనరులను గుర్తించి, వాటికి సంబంధించిన ప్రతిపాదనలు వారం రోజుల్లో తనకు పంపించాలని డి ఆర్ డి ఓ మదనగోపాలకు ఆదేశించారు. రెండో విడతలో 20 గ్రామాలను మండలాల వారీగా గుర్తించి, ప్రతి గ్రామంలో నెలకొన్న సమస్యలను సంబంధిత గ్రామంలోని పెద్దల ద్వారా తెలుసుకొని, గ్రామాలలో పర్యటించి ఆ గ్రామంలో ముఖ్యమైన సమస్యలను గుర్తించి, గ్రామాల అభివృద్ధి కొరకు అవసరమైన ప్రతిపాదనలు ఒక వారం రోజుల్లో సమర్పించాలని ఆయన అన్నారు. సంబంధిత అధికారులు గ్రామాలలో పర్యటించి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను ,ప్రజల ద్వారా తెలుసుకొని వాటికి సంబంధించింది మాత్రం తప్పనిసరిగా నివేదికలో పొందుపరచాలని ఆయన అన్నారు. 
     ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ మదన గోపాల్ , ఎస్ ఓ సురేష్ బాబు, డిఎంజిసిసి వాణి, డిపిఓ పవన్ ,ఐసిడిఎస్ పిడి వరలక్ష్మి, వ్యవసాయ అధికారి రవికుమార్, ఇరిగేషన్ అధికారి అర్జున్ ,డి ఈ ఓ సోమశేఖర్ శర్మ ,తదితరులు పాల్గొన్నారు. 
అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడం అయినది-------