కొనసాగుతున్న న్యాయవిజ్ఞన సదస్సులు

Published: Thursday November 11, 2021
చట్టాల గురించి తెలుసు కుంటున్న స్థానికులు
మంచిర్యాల బ్యూరో, నవంబర్ 10 , ప్రజాపాలన : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ(సుప్రీంకోర్టు) ఆదేశానుసారం 75వ ఆజాధికా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికారసంస్థ చైర్మన్ డి. వెంకటేష్ అద్వర్యం లో అక్టోబర్ 2 నుంచి గ్రామాల్లో నిర్వహిస్తున్న న్యాయ విజ్ఞాన సదస్సులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. చట్టాలగురించి తెలుసు కోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతు న్నారు. న్యాయ స్థానం అంటే అనేక అనుమానాలు, బయాలు కల్గి ఉన్న స్థాని కులు న్యాయవిజ్ఞాన సదస్సుల ద్వారా చైతన్య వంతులవు తున్నారు. వారి అను మానాలను, అపో హలపై సమాదానాలు పొంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
జిల్లా కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సులు
ఆజాధికా అమృత్ మహోత్సవంలో భాగంగా గౌరవ సుప్రీంకోర్టు ఆదేశానుసారం నిర్వహిస్తున్న ఆజాధికా అమృత్ మహోత్సవం లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో ని మారుతి నగర్, సాయికుంట - గర్మిల్ల, చున్నంబట్టి వాడలలో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ సేవ సంస్థ కరపత్రాలను పంపిణీ చేయడం  జరిగింది. ఈ సదస్సులలో ప్యానల్ న్యాయవాది తాజుద్దీన్ పాల్గొని పలు చట్టాల గురించి వివరించి ప్రజలకు అవగాహన కలిపించారు.  ఈ కార్యక్రమంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ సభ్యులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.