జీసస్ జీవితం ఆదర్శ నీయo మునిసిపల్ చైర్మన్ మొండితోక లతాజయాకర్, వైస్ చైర్మన్ విద్యలతావెంకట్ రె

Published: Thursday December 22, 2022
వెంకయ్య మధిర డిసెంబర్ 21 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు పట్నంలోని అజాద్ రోడ్డులో ప్రముఖ సామాజిక సేవకులు  మధిర ఆశమిత్ర లంకా కొండయ్య నివాసంలో మంగళవారం రాత్రి సెమీక్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిదిగా మధిర మున్సిపల్ చైర్మన్ శ్రీమతి లతా జయాకర్, వైస్ చైర్మన్ శ్రీమతి శీలం విద్యాలతా వెంకటరెడ్డి, ఎంపీపీ మొండెం లలిత వెంకయ్య విశిష్ట అతిధులుగా హాజరై సెమీ క్రిస్మస్ వేడుకలలో కేక్ కట్ చేసి ప్రతి మనిషి మానవ విలువలకు కట్టుబడి ఉండాలి అని యేసుక్రీస్తులాగా కరుణ, జాలి, దయ, ఓర్పు, సహనం కలిగి ఉండాలి అని, ఎదుటి వారిని మంచి మనసుతో అందరించాలి అని పాపాన్ని విడిచి దైవమార్గంలో నడిచినప్పుడే మానవతా విలవులకు అర్ధం ఉంటుంది అని వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారుమదర్ థెరిసా లాగా కొండ య్య సామాజిక సేవలద్వారా మానవ సేవే దేవుని సేవగా భావించి సేవలు అందించటం అభినందనీయo అని వారు అన్నారు. అనంతరం కేరళ భిషప్ ట్రైనింగ్ పూర్తి చేసిన దైవ సేవకులు తాళ్ళూరి బాలరాజు మైలవరం  మరియు తెలంగాణ ట్రైబెల్ ఏవంజలిస్టు పాస్టర్ ఎన్ సుబ్బారావు యేసు క్రీస్తు జీవితం ద్వారా మానవాళి మనుగడ ఎలా ఉండాలో సంపూర్ణoగా వివరించి దైవ ప్రార్ధనలు చేసినారు. అనంతరం న్యూ ఇయర్ క్యాలెండరును అతిధుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి సంగస్తులకు వచ్చిన ప్రజలకు నూతన యెరూషలేము సంఘo ద్వారా పంచి పెట్టినారు.ఈ కార్యక్రమంలో లంకా సేవ ఫౌండేషన్ నిర్వహకులు లంకా కరుణ లియోనా, లంకా శ్యామ్ కుమార్, పండు, గోపీ, సాయి,నరేంద్ర, గోపీ యూత్  మరియు సంధ్య  పాస్టర్ యోహాను కమల తెలంగాణ ఆంధ్ర రెండు రాష్టలా ఇన్క్సూరెన్స్ ట్రైనర్ ఎం  శ్రీ మంత్ కుమార్ పాల్గొని క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియ పరిచినారు. వచ్చిన పెద్దలను లంకా సేవాఫౌండేషన్  నిర్వహకులు ఘనంగా సత్కరించారు.