వేంకటేశ్వర స్వామి దేవాలయ గుట్టను సంరక్షించండి. అక్రమ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని

Published: Tuesday January 03, 2023

కోరుట్ల, జనవరి 02 ( ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం గుట్టను క్రమంగా అనధికారిక జేసీబి లతో తవ్వకాలు జరిపి మట్టిని టిప్పర్ లలో అక్రమంగా తరలించి గుట్టను మరియు పరిసర పర్యావరణ ప్రాంతాలను నిర్వీర్యం చేస్తున్నారని గుంలపూర్ గ్రామస్థులు కోరుట్ల తహశీల్దార్ కి సోమవారం రోజున పిర్యాదు చేశారు.అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని పలుమార్లు గ్రామ మరియు మండల అధికారులు దృష్టికి మౌకికంగా తీసుకెల్లిన  ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు.
తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయని, గుట్ట త్రవ్వకాలను తక్షణమే నిలిపి వేసి గ్రామ గుట్టను మరియు దేవాలయ భూములను సంరక్షించాలని కోరారు.  తరుచూ తవ్వకాలు జరుపుచు , ఆపరిమితికి మించిన లోడ్ తో టిప్పర్లు రోడ్లపై తిరగడం వల్ల రోడ్లు చెడిపోతున్నాయని, ప్రజలు తీవ అవస్థలు గురవుతున్నారని వెంటనే ఈ అక్రమ తవ్వకాలను  నివారించి, త్రవ్వకాలు జరిపే వ్యక్తి పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోగలరని గ్రామస్థులు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు రమణ, గంగ మల్లయ్య, అరుణ్ రావు, ప్రవీణ్, వెంకటేష్, రవి, పరమేష్, గంగా నర్సయ్య, అనిల్, లక్ష్మణ్, సతీష్, నవీన్, ప్రశాంత్, శ్రీకాంత్, సురేష్, ఉపేందర్ తదిదరులు పాల్గొన్నారు.