రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి జిల్లా క్రీడా, యువజన శాఖ అధికారి శ్ర

Published: Thursday January 05, 2023
మంచిర్యాల బ్యూరో,   జనవరి 4, ప్రజాపాలన :
 
రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరుగనున్న యువజనోత్సవాలలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా క్రీడా, యువజన శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలను మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్చర్మన్ ముఖేష్ గౌడ్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా, యువజన శాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో యువజనోత్సవాలను నిర్వహించడం గర్వంగా ఉందని, ఈ ఉత్సవాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా క్రీడా వైభవాన్ని రాష్ట్ర, జాతీయస్థాయిలో చాటాలని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలలో ప్రథమ బహుమతి ఆదర్శ కళాశాల రాజీవ్ నగర్ గెలుచుకోగా, ద్వితీయ బహుమతి వి.వి.డి.సి. కళాశాల సాధించారని, విజేతలు ఈ నెల 9, 10 తేదీలలో మహబూబ్నగర్లో జరుగనున్న ఉత్సవాలలో పాల్గొనాలని తెలిపారు. న్యాయనిర్ణేతలుగా చిదానందనకుమారి, జ్యోత్స్న చంద్రదత్, శాంకరీలు వ్యవహరించారని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో జాతీయ కళాకారులు, తెలంగాణ ధూం ధాం వ్యవస్థాపన అధ్యక్షులు అంతడుపుల నాగరాజు, ఎన్.ఎస్.ఎస్. కో-ఆర్డినేటర్ చంద్రమోహన్, జిల్లా కబడ్డీ కార్యదర్శి రాంచందర్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాండ్ల మధుకర్, జిల్లా నృత్య కళా సమాఖ్య అధ్యక్షులు రాకం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.