ఉచిత పోలీసు శిక్షణకు దరఖాస్తులు చేసుకోండి బెల్లంపల్లి జిఎం బి, దేవేందర్

Published: Tuesday October 25, 2022
బెల్లంపల్లి జిఎం  బి, దేవేందర్
 
బెల్లంపల్లి అక్టోబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: ఉచితంగా పోలీస్ శిక్షణ పొందగోరె వారు దరఖాస్తులు చేసుకోవాలని  బెల్లంపల్లి ఏరియా జి ఎం.  జి, దేవేందర్ తెలిపారు.
సింగరేణి కాలరీస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత పోలీస్ రిక్రూట్ మెంట్  శిక్షణకు ప్రిలిమినరీ పరీక్షలో ఉతీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్  జి, దేవేందర్ శనివారం తెలిపారు. స్థానిక జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు,
అభ్యర్థులకు 3నెలల పాటు అల్పాహారం తో కూడిన  ఈవెంట్స్, రాత పరీక్షల శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు .  ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29 వ తేదీ లోగా జీ ఎం  కార్యాలయం లోని పర్సనల్ డిపార్ట్మెంట్ లో దరఖాస్తులు అందజేయాలని కోరారు. 
దరఖాస్తు ఫారం తో పాటు హాల్ టికెట్, ప్రిలప్రిలిమినరీ అర్హతపత్రం జతచేయాలని తెలిపారు