కులాల వారిగా గణన చేపట్టాలి జన్నారం, నవంబర్ 10, ప్రజాపాలన:

Published: Friday November 11, 2022
 కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో దేశవ్యాప్తంగా చేపట్టే జనగణలో బీసీలో కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరుతున్నామని, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బీసీ కులాల  కన్వీనర్ కోడూరు చంద్రయ్య,  బీసీ సంఘం సీనియర్ నాయకుడు శ్రీరాముల గంగాధర్ కోరారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీలో కులాల వారిగా జనాభా లెక్కల వివరాలు లేకపోవడం వలన రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పరంగా విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘం సీనియర్ నాయకుడు అక్క పెళ్లి నరసింహులు, కోడి జుట్టు రాజన్న, మామిడి విజయ్, జంగం సంతోష్, ఆడేపు  లక్ష్మీనారాయణ, మూల భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.