ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఊరుకోం ఎమ్మెల్యే రేఖనాయక్

Published: Tuesday March 14, 2023

జన్నారం,మార్చ్ 13, ప్రజాపాలన: ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే మా పార్టీకి చెందిన వారికి నోటీసులు వస్తే ఊరుకునేదిలేదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖనాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎఆర్ఎస్ కాలేజీ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా పార్టీలో ఉంటూ ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడితే నాయకులు, కార్యకర్తలు, ఎవరైనా మా దృష్టికి తీసుకురావాలన్నారు. గతంలో అసెంబ్లీలో మండలంలోని పోనకల్ చెరువు సర్వే నెంబర్ 400 రియల్ ఎస్టేట్ దారులు కబ్జా చేస్తున్నారని తెలపడం జరిగిందన్నారు. అదేవిధంగా కిష్టాపూర్ చెరువు కూడా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని, రైతులకు మత్స్య కార్మికులకు గ్రామ ప్రజలకు న్యాయం జరిపిస్తానని ఆమె తెలిపారు. దళిత బంధు ఇచ్చే 10 లక్షల రూపాయలు విషయంలో కూడా పదిమందికి  ఇవ్వడమా తుది నిర్ణయం గ్రామ ప్రజల ఆధారంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు అందిస్తామన్నారు. ప్రజలు దళారుల చేతిలో మోసపోవద్దని, లబ్ధిదారులను మండలంలోని ప్రతి గ్రామాలలో నేరుగా గుర్తించి వారికి అర్హులైన వారికి ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. పేద ప్రజలకు న్యాయం చేసే దిశగా బిఆర్ఎస్ పార్టీ ముందుకు వెళుతుందన్నారు. అదేవిధంగా మండలంలోని పలు వివాహలలో పాల్గొని ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. గృహప్రవేశంలో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ గుడ్ల రాజేష్ యాదవ్, భరత్ కుమార్, ముత్యం సతీష్, పోనకలు ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, జన్నారం ఎంపీటీసీ రియాజుద్దీన్, జన్నారం ఉపసర్పంచ్ జంగం రవి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.