రైతుబంధు ఎవరికోసం

Published: Thursday January 13, 2022
రైతు బంధు రైతులకా, విద్యార్థులకా మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం
మధిర జనవరి 12 ప్రజాపాలన ప్రతినిధి. మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ ఎస్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో అధ్యక్షులు మాట్లాడుతూ చదువుకునే విద్యార్థుల కు రైతుబంధు కు సంబంధమేమిటి. రైతులకు చెబితే ఎవరూరారనివిద్యార్థులనుతీసుకొచ్చారా. రైతుబంధు ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన కొత్త పథకం మాలేక పథకంలో నగదు  పెంపు ఏమన్నా జరిగిందా. ఎవరికోసం, ఎందుకోసం ఈ సంబరాలు సంబరాలంటూ విద్యార్థులకు అవగాహన అంటూ టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఈ ప్రచారం ఏమిటి.ఎవరి కోసం.సూరం శెట్టి  కిషోర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ అధ్యక్షతన పత్రికా విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా సూరంసెట్టి కిషోర్ మాట్లాడుతూ రైతుబంధు పేదల కోసమా. ధనవంతుల కోసమా.ఒక ఎకరం నుంచి అయిదు ఎకరాలు సన్న చిన్నకారు రైతుల కోసం పెట్టిన రైతుబంధు... టీ.ఆర్.ఎస్ నాయకులకు రైతుబంధు ఒక వరంగా మారింది.. ఒకటి నుండి అయిదు ఎకరాలకు రైతుబంధు కాదు, వందల ఎకరాలకు రైతుబంధు కాదు, వేల ఎకరాలకు రైతుబంధు అన్న పదంగా మార్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రజాప్రతినిధులకు రైతుబంధు ఒక్క వరంలా మారింది... రైతుబంధు సంబరాలంటూ విద్యార్థులకు అవగాహన అంటూ టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఈ ప్రచారం ఏమిటి.రైతులకు చెబితే ఎవరూ రారని విద్యార్థులను తీసుకొచ్చారా ఏమిటి... రైతుబంధు సంబరాలంటూ విద్యార్థులకు అవగాహన అంటూ టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఈ ప్రచారాన్ని ఏమంటారో... ఓమిక్రాన్ పెరుగుతున్న దిశగా గుంపులు గుంపులుగా తిరిగితే కేసుల అంటారు కదా మరి టీఆర్ఎస్ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టాలి.. రైతు బంద్ కు విద్యార్థులకు అసలు సంబంధమే లేదు... వందల వేల ఎకరాలు ఉన్న టీఆర్ఎస్ నాయకులకు రైతుబంధు ఇచ్చే బదులు కౌలు రైతులకు ఎంతో కొంత సహాయం చేయవచ్చు కదా... తెలంగాణ రాష్ట్రంలో కౌలు రైతులే ఎక్కువ మంది వున్నారు... కౌలు రైతులు అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న కనికరించరా... రైతుబంధు ముసుగులో ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అణగదొక్కే సమయం దగ్గర లోనే ఉన్నది ఇక మీ ఆటలు చెల్లవు అన్నారు. ఈ సమావేశంలో మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ మధిర మండల బీసీ సెల్ అధ్యక్షుడు చిలువేరు బుచ్చి రామయ్య మధిర మండల గాంధి పదం అధ్యక్షుడు అదురీశ్రీను మధిర మండల ఐఎన్టియుసి అధ్యక్షుడు కోరం పల్లి చంటి మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ మధిర పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్యా మొదలగు వారు పాల్గొన్నారు