పౌష్టికాహారం పై అవగాహన*

Published: Wednesday March 29, 2023
మంచిర్యాల టౌన్, మార్చి 28, ప్రజాపాలన: 
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతుతి నగర్ లో ఉన్న ఎసిసి న్యూ అంగన్వాడి  కేంద్రంలో పోషణ మాసం లో భాగంగా పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమం అంగన్వాడి టీచర్ బి పద్మ, ఆయా జె భారతి ల ఆధ్వర్యంలో నిర్వహించారు.  
ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రం నిర్వాహకురాలు పద్మ మాట్లాడుతూ గతంలో మన పూర్వికులు చెమటోడ్చి కష్టపడేవారని కల్తీ లేని ఆహారాన్ని తీసుకునే వారిని, ప్రస్తుతం జనాభా పెరుగుదలకు తగినంత ఆహారం లేక   నేడు ఆహార ధాన్యాలు అన్ని కల్తీ దిశగా పయనిస్తున్నాయని అందుకే  గర్భిణీలు బాలింతలు కిశోర  బాలికలు నువ్వులు బెల్లం పల్లీలు చిరుధాన్యాలు   తోటకూర కోడిగుడ్లు పాలు రాగి పిండితో చేసిన జావా తదితర ఆహారపు అలవాట్లుగా రోజు  తీసుకున్నట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినట్లుగా  మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. 
ఈ కార్యక్రమంలో గర్భిణీలు బాలింతలు కిశోర బాలికలు  వార్డ్ కౌన్సిలర్ లావణ్య నగేష్ తదితరులు పాల్గొన్నారు.