సాంస్కృతిక సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

Published: Wednesday September 01, 2021
వలిగొండ, ఆగస్టు 31, ప్రజాపాలన ప్రతినిధి : ప్రజానాట్యమండలి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12 వ తేదీన వలిగొండ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సాంస్కృతిక సమ్మేళనంలో కవులు, కళాకారులు, రచయితలు, జానపద కళాకారులు, అభ్యుదయవాదులు, కళాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని గోకారం గ్రామంలో ప్రజానాట్యమండలి ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షులు గంటేపాక శివ అధ్యక్షతన నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక వాగ్దానాలు ప్రజలకు, కవులకు, కళాకారులను ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన ఏడు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేసే పరిస్థితి లేదని విమర్శించారు.భారత సమాజ పరిణామ క్రమంలో, అనేక పోరాటాలలో జానపద వృత్తి మరియు అన్ని రకాల కళాకారుల పాత్ర చాలా కీలకమని కానీ నేటి బిజెపి మతోన్మాద ప్రభుత్వం అభ్యుదయ కళాకారులను తమ తప్పుడు విధానాలను తమ ఆట, పాటల ద్వారా, రచనల ద్వారా ఎండగడుతుంటే భరించలేని కేంద్ర ప్రభుత్వం దాడులు దౌర్జన్యాలు చేస్తూ అనేక రకాలైన కేసులు బనాయిస్తూ భౌతికంగా లేకుండా చేస్తున్నారని వీటికి వ్యతిరేకంగా సాంస్కృతిక రంగ కళాకారులు, కవులు, రచయితలు తమ ఆట పాట రచనలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటులో కళాకారులు చాలా కీలక భూమిక పోషించారు అని ఆనాడు కేసీఆర్ ప్రతి జానపద వృత్తి కళాకారులకు ఈనాటి కళాకారులకు ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రచారాలు ఉపయోగించుకుంటామని చెప్పి నేటికీ కళాకారులను ఆదుకునే పరిస్థితి లేదని ఆవేదన వెలిబుచ్చారు ఇప్పటికైనా ప్రభుత్వం కళాకారులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని నర్సింహ డిమాండ్ చేసినారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న నాటి జానపద కళాకారులు, కోలాటం, భజన, డబ్బు, వీధి నాటకాలు, పల్లె సుద్దులు అనేక రకాలైన కళాకారులను నాటి నేటి కలయికతో పాలకుల విధానాలపై ప్రజల సమస్యలపై రానున్న కాలంలో తీసుకోబోవు కార్య క్రమాలగురించి చర్చించ టానికి ఈ స్కాంకృత సమ్మెళనం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ తెలియజేసినారు. ఈ సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజానాట్యమండలి మాజీ కార్యదర్శి కొండమడుగు నర్సింహ, ప్రజానాట్యమండలి జిల్లా గౌరవ అధ్యక్షులు అవ్వారి గోవర్దన్,మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు సిరిపంగి శ్రీరాములు, జిల్లా కార్యదర్శి దేశపాక రవి,జిల్లా ఆఫీస్ బేరర్స్ కందుల హన్మంతు, మేడి ముకుందా, మైలారం శివ తదితరులు పాల్గొన్నారు.