హీరో కృష్ణం రాజు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు ప్రెస్ క్లబ్ నేలకొండపల్లి...

Published: Monday September 12, 2022

పాలేరు సెప్టెంబర్ 11 ప్రజా పాలన ప్రతినిధి

ఖమ్మం: ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో, మాజీ కేంద్రమంత్రి శ్రీ కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల. ప్రెస్ క్లబ్ నేలకొండపల్లి అధ్యక్ష కార్యదర్శులు మైసా శ్రీనివాస రావు,గంజికుంట్ల వెంకన్న,మరియు గౌరవ అధ్యక్షులు

పెంటమల్ల కోటయ్య,

ఆదివారం సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి తన విలక్షణ నటనాశైలితో రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం తెలుగు వెండితెరకు తీరని లోటని వారు పేర్కొన్నారు. లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు

పివీ నాగిరెడ్డి, వంగవీటి పవన్, ఎం ప్రవీణ్, విజయ్ కుమార్, రవి, పసుమర్తి శ్రీనివాసరావు, వల్లూరి సంతోష్, ఎస్ కె పాషా, యం రాంబాబు, పి సూర్య, తదితరులు పాల్గొన్నారు